కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండంల కాళోజీవాడి గ్రామానికి చెందిన రజితకు... కామారెడ్డికి చెందిన శ్రీకాంత్‌తో 2018లో వివాహం జరిపించారు. రజిత తల్లి చిన్నతనంలోనే చనిపోవడంతో... పెళ్లి తంతు మేనమామ జరిపించాడు. రెండెకరాల వ్యవసాయ భూమిని అమ్మి కట్నం ఇచ్చారు.
పెళ్లైన నెల రోజుల నుంచే అదనపు కట్నం కోసం శ్రీకాంత్ వేధించడం మొదలుపెట్టాడు. రజిత రాజంపేట మండలంలో నాబార్డు విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తుంది. పెళ్లైన నాటి నుంచి మధ్యలో 5 తులాల బంగారం కూడా ఇచ్చామని... నెల క్రితమే బైక్ కోసం 80 వేల రూపాయలు కూడా శ్రీకాంత్‌కు ఇచ్చామని కుటుంబ సభ్యులు తెలిపారు.
అయినా సరే వేధింపులు ఆగలేదని... గురువారం మళ్లీ అదనపు కట్నం కోసం... ఆడపడుచులు స్వప్న, లతలతో కలిసి తీవ్రంగా కొట్టాడని తెలిపారు. ఈ ఘటనలో రజిత తీవ్రగాయలపాలైంది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించగా... చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. భర్త, ఆడపడుచుల వేధింపుల వల్లనే రజిత మృతి చెందిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
నిందితులను... అరెస్టు చేసి జైలుకు తీసుకెళ్లి తప్పు చేయకుండా... తన బిడ్డను చంపిన తరహాలోనే వాళ్లని చంపాలని... మేనత్త ఏడ్చిన తీరు అందరితో కంటతడి పెట్టించింది.
ఇవీ చూడండి: కరోనా నుంచి కోలుకున్న తర్వాత మెడనొప్పి!