ETV Bharat / state

భూ తగాదాల్లో అన్నను నరికి చంపిన తమ్ముడు.! - కామారెడ్డి జిల్లా వార్తలు

భూమి విషయంలో వచ్చిన తగాదా ఒక వ్యక్తి మరణానికి కారణమైన ఘటన కామారెడ్డి జిల్లా భిక్నూర్​ మండలంలో చోటు చేసుకుంది. కోపంలో అన్న మీద తమ్ముడు కొడవలితో దాడి చేయడం వల్ల అన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

Man murdered in land disputes in kamareddy district bhiknoor
భూతగాదాల్లో అన్నను నరికిన తమ్ముడు!
author img

By

Published : Jul 16, 2020, 4:10 PM IST

Updated : Jul 16, 2020, 4:21 PM IST

కామారెడ్డి జిల్లా భిక్నూర్​ మండలం తిప్పాపూర్​ గ్రామానికి చెందిన రాజయ్య, శంకర్​లు అన్నదమ్ములు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య భూమి విషయంలో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. తాజాగా బుధవారం రాత్రి ఇద్దరు అన్నదమ్ములు అర్ధరాత్రి వరకు మద్యం సేవిస్తూ.. భూమి గురించి చర్చించుకున్నారు. ఆ సమయంలో రాజయ్యకు కొడుకులు లేని కారణంగా రాజయ్య భూమి కూడా తనకే చెందుతుందని తమ్ముడు శంకర్​ అన్నాడు. అందుకు ఒప్పుకోని రాజయ్య శంకర్​తో వాదించాడు.

మద్యం మత్తులో కోపగించుకున్న శంకర్.. రాజయ్య మీద అదే రాత్రి కొడవలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ రాజయ్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కాగా.. శంకర్​ పారిపోయి.. కొద్దిసేపటి తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: మహబూబాబాద్ జిల్లా చీకటాయపాలెంలో రోడ్డు ప్రమాదం

Last Updated : Jul 16, 2020, 4:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.