ఈటీవీ భారత్‌లో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. కామారెడ్డి జిల్లా మద్నూరు ప్రభుత్వ ఆస్పత్రిలో రోగికి గడువు ముగిసిన సెలైన్ ఎక్కించిన ఘటనలో ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆనంద్ జాదవ్‌కు మెమో జారీ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అజయ్ కుమార్ తెలిపారు. ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీనివాస్‌తో ఆయన చరవాణిలో మాట్లాడారు. 24 గంటల్లో ఆస్పత్రి వైద్యుడు వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. వివరణ ఇచ్చిన నివేదికను కమిషనర్‌కు పంపిస్తామని పేర్కొన్నారు.
ఆస్పత్రిని జిల్లా క్వాలిటీ మేనేజర్ రాము సందర్శించారు. గడువు ముగిసిన మందులు.. మందుల నిల్వ గదిని పరిశీలించారు. గడువు ముగిసిన మందుల వివరాలను ఫార్మసిస్ట్ శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న సుమలత ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. ఆరోగ్యం బాగానే ఉందని వైద్యుడు సమాధానమిచ్చారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి వైద్యులు ఫార్మసిస్ట్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని రోగులు ఆయనకు విన్నవించారు.
ఇవీ చూడండి: రోగికి గడువు ముగిసిన సెలైన్ ఎక్కించిన వైద్య సిబ్బంది