ETV Bharat / state

రోగికి గడువు ముగిసిన సెలైన్​ ఎక్కించిన వైద్య సిబ్బంది - రోగికి గడువు ముగిసిన సెలైన్​ ఎక్కించిన వైద్య సిబ్బంది

అనారోగ్యంతో ప్రభుత్వాసుపత్రికి వచ్చిన ఓ మహిళకు వైద్య సిబ్బంది గడువు ముగిసిన సెలైన్​ ఎక్కించారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మద్నూరు లో జరిగింది.

సెలైన్​
సెలైన్​
author img

By

Published : Apr 26, 2020, 9:09 PM IST

జ్వరంతో బాధపడుతూ కామారెడ్డి జిల్లా మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన సుమలత అనే మహిళకు వైద్య సిబ్బంది గడువు ముగిసిన సెలైన్​ ఎక్కించారు. ఈ విషయాన్ని గుర్తించిన ఆ మహిళ భర్త నాగేశ్... సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. వారు పొరపాటు జరిగిందంటూ సరిపెట్టారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై చరవాణిలో జిల్లా ఆసుపత్రుల పర్యవేక్షణ అధికారి అజయ్​కుమార్​కు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి: కరోనా వేళ 'మూర్తీ'భవించిన మానవత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.