ఇదీ చూడండి: రాజకీయాల్లో గుణాత్మకమార్పు తెస్తా... ఆశీర్వదించండి!
'తెరాస ఎంపీలు గెలిస్తే... తెలంగాణ గడ్డకు లాభం' - 2019 elections
కామరెడ్డి జిల్లా మాచారెడ్డి పాల్వంచ మర్రి వద్ద కాంగ్రెస్ నేతలు తెరాసలో చేరిక కార్యక్రమానికి ఆ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరయ్యారు. తెలంగాణ ఎంపీలు గెలిపిస్తే... కాళేశ్వరానికి జాతీయ హోదా తెచ్చుకోవచ్చని తెలిపారు.
'తెరాస ఎంపీలు గెలిస్తే... తెలంగాణ గడ్డకు లాభం'
తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే రాహుల్ గాంధీకి... భాజపా సభ్యులు గెలిస్తే మోదీకి... గులాబీ పార్టీ ఎంపీలు గెలిస్తే తెలంగాణ గడ్డకు లాభమని తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పాల్వంచ మర్రిలో కాంగ్రెస్ నాయకులు తెరాసలో చేరిక కార్యక్రమానికి హాజరయ్యారు. తెలంగాణ నుంచి 16 ఎంపీలను గెలిపిస్తే... కాళేశ్వరానికి జాతీయ హోదా తెచ్చుకోవచ్చని తెలిపారు. దేశంలో మోదీ వేడి తగ్గింది.. కాంగ్రెస్ గాడి తప్పిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, భాజపా ఎంపీలను గెలిపించి దిల్లీకి గులాములు అవుదామా... తెరాస ఎంపీలను గెలిపించి తెలంగాణకు గులాబీలవుదామా? అని ఆలోచించుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: రాజకీయాల్లో గుణాత్మకమార్పు తెస్తా... ఆశీర్వదించండి!