ETV Bharat / state

కామారెడ్డిలో యూత్​ పార్లమెంట్...​ వాడీవేడి చర్చ! - కామారెడ్డి

కామారెడ్డి జిల్లా దోమకొండలోని ఓ గురుకులంలో యూత్ పార్లమెంట్ నిర్వహించారు. జిల్లాలోని పదకొండు పాఠశాలలకు చెందిన 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

యూత్​ పార్లమెంట్​
author img

By

Published : Sep 6, 2019, 11:45 PM IST

యూత్​ పార్లమెంట్​

పార్లమెంట్​లో వాడివేడి చర్చ జరుగుతోంది. అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. సభాపతి సభను నియంత్రిస్తున్నారు. ఇదంతా దిల్లీ పార్లమెంట్​లో జరిగింది కాదు. కామారెడ్డి జిల్లా దోమకొండలోని ఓ గురుకులంలో నిర్వహించిన యూత్ పార్లమెంట్ నమూనాలో కనిపించిన దృశ్యాలు. దోమకొండలో సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో యూత్ పార్లమెంట్ జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. జిల్లాలోని పదకొండు పాఠశాలలకు చెందిన 300 మంది విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. పార్లమెంట్​ తరహాలో వివిధ పదవులతో దేశ రాజకీయాలపై ప్రసంగాలు, ప్రదర్శన నిర్వహించారు. పిల్లలు రాజకీయ నాయకుల వేషధారణతో యూత్ పార్లమెంట్​లో పాల్గొని అలరించారు. యూత్ పార్లమెంట్​లో పాల్గొనడం మంచి అనుభూతి, అనుభవాన్ని మిగిల్చిందని విద్యార్థులు పేర్కొన్నారు.

ఇవీ చూడండి : రహదారి పూర్తి చేయాలంటూ విద్యార్థుల రాస్తారోకో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.