లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలందరూ భౌతిక దూరం పాటించాలనే ఉద్దేశ్యంతో కూరగాయల మార్కెట్‌ను కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సీయస్ఐ చర్చి గ్రౌండ్‌కు తరలించారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి కట్టడి చేయడానికి జిల్లా ఆధికారులు వినూత్నంగా ఆలోచన చేశారు. మార్కెట్‌కు వచ్చి వెళ్లేందుకు ఓ ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ మార్గంలో ఓ యంత్రాన్ని అమరిచారు. ప్రత్యేక మార్గంలో వెళ్లేవారిపై తుంపర్ల రూపంలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పడేలా ఏర్పాట్లు చేశారు. ఈలా చేయడం వల్ల కరోనా వ్యాప్తిని కొంత మేరకు అరికట్టవచ్చని ఆధికారులు చెబుతున్నారు.
ఈ పద్ధతి మార్కెట్‌కు వచ్చే కొనుగోలుదారులకు కొత్త అనుభూతిని కలిగిస్తోంది. ఈ కొత్త ఆలోచన పట్లు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: కోర్టు ఏదైనా విచారణ ఇక వీడియో కాన్ఫరెన్స్‌లోనే!