కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం చించొల్లిలో నాణేలతో బిందెను తీర్చిదిద్దారు కిషన్ అనే రైతు. రూపాయి నాణేలతో దాదాపు ఆరు గంటలు శ్రమించి ఈ బిందెను(binde with coins) తయారు చేసినట్లు తెలిపారు. సుమారు రెండు వేల రూపాయి నాణేలను... ఫెవికల్‌తో అతికించి ఈ బిందెను రూపొందించినట్లు వివరించారు. దుర్గామాత కోసం తయారుచేసిన బిందెను... మండపం నిర్వాహకులకు బహుకరించారు. నాణేలతో తయారుచేసిన ఈ బిందె... చూపరులను ఆకట్టుకుంటోంది.
ఇదీ చదవండి: Saddula bathukamma 2021: సద్దుల బతుకమ్మ స్పెషల్.. నైవేద్యాలు ఏంటంటే?