కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగతుండటం వల్ల వైరస్ నియంత్రణ చేయుట కొరుకు పట్టణంలో కలెక్టర్ శరత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారితో ప్రైమరీ కాంటాక్ట్, అలాగే సెకండరీ కాంటాక్ట్ ఉన్న వారి ఇంటికి ప్రతిరోజూ వైద్యాధికారులు వెళ్లి పరిశీలన చేయాలని తెలిపారు. పట్టణంలోకి కొత్తగా వచ్చిన వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించాలని కోరారు.
ప్రతి రోజూ పట్టణమంతా రసాయన పిచికారి చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటించేవిధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. లాక్డౌన్ అతిక్రమించిన వారిపై నాన్ బెయిలబుల్ కేసు, రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.
ఇదీ చూడండి: భారత్కు ఏడీబీ 220 కోట్ల డాలర్ల సాయం