ETV Bharat / state

కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్​ - ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

రాష్ట్రంలో ఆడపిల్ల పుడితే కడుపున పెట్టుకుని చూసుకునే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణ లక్ష్మి వంటి పథకాలను ప్రవేశపెట్టారని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

kalyana lakshmi cheques distribution by gampa govadhan
కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్​
author img

By

Published : Mar 3, 2020, 11:28 AM IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 42 మంది లబ్ధిదారులకు రూ. 42 లక్షల 4 వేల కల్యాణ లక్ష్మి చెక్కులను ప్రభుత్వ విప్​ గంప గోవర్ధన్​ పంపిణీ చేశారు. ఇటీవల బీబీపేట మండలం ​రామ్​రెడ్డి పల్లి గ్రామంలో చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుడు మామిండ్ల బాలయ్య కుటుంబసభ్యులకు రూ. 6 లక్షల చెక్కును ఆయన అందజేశారు.

తెరాస రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటివరకు 1759 మందికి 17.22కోట్ల రూపాయల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారాక్ చెక్కులను పంపిణీ చేసినట్లు గోవర్ధన్​ తెలిపారు. రాష్ట్రంలో ఆడపిల్ల పుడితే బాధపడాల్సిన రోజులు పోయాయని అన్నారు. ఆడపిల్ల పుడితే కడుపున పెట్టుకుని కాపాడే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయన్నారు.

కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్​

ఇదీ చూడండి : 'రెండు పడకల గదుల ఇళ్లు ఎప్పుడు నిర్మిస్తారు..?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.