కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా పాలనాధికారి సత్యనారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జిల్లాస్థాయి దివ్యాంగుల క్రీడోత్సవాల్లో విజేతలకు ఆయన బహుమతులను అందజేశారు. కలెక్టర్ చొరవ తీసుకుని తమకు బ్యాటరీ సైకిళ్లు అందించారని దివ్యాంగులు సంతోషం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయిలో దివ్యాంగులందరికీ సైకిళ్లు ఇప్పించాలని కోరారు.
ఇదీ చదవండిః కళాశాల ముందున్న వైన్‌షాప్ తీసేయాలి..