Illegal Mining Blast in Kamareddy : కామారెడ్డి జిల్లాలో కంకర, బండరాళ్ల క్వారీల్లో ఉల్లంఘనలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పాల్వంచ మండలం మంథని దేవునిపల్లిలోని క్వారీలో యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తూ నిర్దేశిత పరిధి దాటి తవ్వకాలు జరిగినట్లు నిర్ధారణ అయింది. స్థానికులు, మండల ప్రజా ప్రతినిధులు ఉమ్మడి జిల్లా ఇంఛార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు(Minister Jupally) ఫిర్యాదు చేశారు.
'అక్రమ మైనింగ్ చేస్తే ఉపేక్షించేది లేదు' - మంత్రి జూపల్లి స్ట్రాంగ్ వార్నింగ్
దీంతో సమగ్ర విచారణ జరిపి నిజనిర్ధారణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన అధికారులు అక్కడి తవ్వకాలను చూసి విస్తుపోయారు. భారీ పేలుళ్ల కారణంగా అన్ని అనుమతులను ఉల్లంఘించి మైనింగ్ చేస్తున్నట్టు గుర్తించారు. కామారెడ్డి(Kamareddy) జిల్లావ్యాప్తంగా 31 క్వారీలున్నా బాన్సువాడ ప్రాంతంలోని మూడు క్వారీలు, క్రషర్లకు మాత్రమే పర్యావరణ అనుమతులున్నాయి. మిగితా క్వారీలు, క్రషర్ల నిర్వాహకులు అనుమతుల కోసం దరఖాస్తు మాత్రమే చేసుకున్నారు.
Kamareddy District News : కేంద్ర పర్యావరణ శాఖ నిబంధనలకు అనుగుణంగా ఇక్కడ మొక్కల పెంపకం, ఇతరత్రా ఏర్పాట్లు లేకపోవడంతో అనుమతుల జారీలో జాప్యం జరుగుతోంది. కానీ నిర్వాహకులు మాత్రం అనుమతి లేకున్నా ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టారు. మంథని దేవునిపల్లి క్వారీలో కంకర, బండరాళ్ల తవ్వకాలకు అనుమతులు పొందినప్పటికీ నిర్దేశించిన దానికంటే అధికంగా లోతులో తవ్వకాలు జరిపినట్లు గనుల శాఖ సర్వేలో నిర్ధారణ అయింది.
Illegal Mining in Gadwal District : 'మనల్ని ఎవడ్రా ఆపేది.. తవ్వేయండి.. తర్వాత చూసుకుందాం!'
బ్లాస్టింగ్‌తో పాటు క్వారీ, క్రషర్ల పరిసర ప్రాంతాల్లో నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేయాల్సిన వసతుల ఏర్పాటులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. అభివృద్ధి పనుల పేరుతో క్వారీల్లో యథేచ్ఛగా తవ్వకాలు చేస్తున్నారు. ఇష్టారీతిన బ్లాస్టింగ్లు చేస్తున్నారు. దీంతో సమీపంలోని పంటపొలాల్లో దుమ్ము, దూళి చేరడంతో దిగుబడులు తగ్గుతున్నాయి. సమీపంలోని నివాస గృహాలకు బీటలు వస్తుండడంతో గ్రామీణులు ఆందోళనకు దిగుతున్నారు.
పరిమితికి మంచి తవ్వకాలు, బ్లాస్టింగ్ లు చేపట్టడంతో భూగర్భజలాలు పడిపోయి బోరుబావుల కింద సాగు చేసిన పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది. క్వారీని మూసెయ్యాలని రైతులు, స్థానికులు ఎంత మొత్తుకున్నా ఇన్నాళ్లూ అధికారులు చెవిన పట్టలేదు. మంత్రి ఆదేశించడంతో ఇప్పుడు ఉరుకులు పెడుతున్నారని ప్రజలు అంటున్నారు.
దేవునిపల్లి క్వారీలో ఉల్లంఘనలపై గనుల శాఖ అధికారులు రెండు నెలల కిందటే రూ.51 కోట్ల మేర జరిమానా విధించారు. ఆ వివరాలను బహిర్గతం చేయకుండా గోప్యత పాటించారు. తాజాగా మంత్రి విచారణకు ఆదేశించడంతో జరిమానా విధింపు విషయం వెలుగు లోకి వచ్చింది. గనులలో తవ్వకాల ద్వారా వెలికి తీసిన కంకర, బండరాళ్లను ప్రైవేటు పనులకు కాకుండా ప్రభుత్వ పనులకు వినియోగించినట్లు ఆధారాలు చూపుతూ క్వారీ నిర్వాహకులు జరిమానా విధింపు నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆ ఆర్జీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.తమ మనుగడకు ఇబ్బందిగా మారిన కంకర క్వారీని మూసెయ్యాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో పేదల భూములపై క్రషర్ వ్యాపారుల కబంధహస్తం