ETV Bharat / state

అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి: అఖిలపక్షం

కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట అఖిల పక్ష నేతలు నిరసన చేపట్టారు. సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి, జయతిఘోష్​, ఇతర మేధావులు, జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు.

అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి: అఖిలపక్షం
అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి: అఖిలపక్షం
author img

By

Published : Sep 14, 2020, 11:31 PM IST

అఖిలపక్ష పార్టీల రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట అఖిల పక్ష నేతలు నిరసన చేపట్టారు. మేధావులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు.

ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తుందని నేతలు ఆరోపించారు. ప్రజా సమస్యలపై నిలదీస్తే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. దిల్లీలో ఫిబ్రవరిలో జరిగిన విద్యార్థుల పోరాటంలో పాల్గొని మద్దతు తెలిపినందుకు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి, జయతిఘోష్​, ఇతర మేధావులు, జర్నలిస్టులపై కేసులు పెట్టారని ఆరోపించారు. ఈ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి దశరథ్, సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్, ఎంసీపీఐయూ జిల్లా నాయకులు జబ్బర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీచూడండి.. ఆమె లేకుండా బతకలేను.. మా పిల్లల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.