కామారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసింది. మార్కెట్ యార్డులో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. టార్ఫాలిన్ కవర్లు లేకపోవడం వల్ల ధాన్యం తడిసిందని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఆరుగాలం శ్రమించి పండించిన పంట నీటి పాలైందని వాపోయారు. వర్షాకాలంలో దోమపోటుతో పంటలను తగలబెట్టామని.. ఇప్పుడు వర్షంలో తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
ఇదీ చూడండి: ఆదర్శ పాఠశాలల ప్రవేశ దరఖాస్తు గడువు పెంపు