కరోనా భయంతో పౌల్ట్రీ పరిశ్రమ కుదేలవుతోంది. పలు జిల్లాల్లో భయంతో కోళ్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ మండలం పెద్ద ఏడిగి రహదారి పక్కన ఓ కోళ్ల ఫారం ఉంది. అక్కడ 2500 కోళ్లు ఉన్నాయి.
కరోనా భయంతో వ్యాపారి రాములు ఇప్పటి వరకు 500 కోళ్లను ఉచితంగా అందజేశారు. ఇంకా 2000 ఫ్రీగా ఇస్తానని చెబుతున్నారు. అయినప్పటికీ కొందరు తీసుకునేందుకు ముందుకు వస్తుంటే.. మరికొందరు కరోనా భయంతో జంకుతున్నారు.
ఇదీ చూడండి : జగిత్యాలలో ఓ యువకునికి కరోనా లక్షణాలు