కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకు మాజీ మంత్రి షబ్బీర్ అలీ నిరుపేదలకు నిత్యావసర సరుకులను అందజేశారు. భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన దాడిలో 20 మంది సైనికులు మృత్యువాతపడటం తనను ఎంతో కలచివేసిందని షబ్బీర్ అలీ అన్నారు. రాష్ట్రానికి చెందిన కర్నల్ సంతోష్‌బాబు మరణిస్తే సీఎం స్వయంగా వెళ్లి నివాళులర్పించలేదని దుయ్యబట్టారు. ఎంతటివారికైనా కరోనా వస్తే గాంధీకి వెళ్లాలని సూచించిన కేసీఆర్... ఎమ్మెల్యేలకు వస్తే యశోదాకు ఎందుకు పంపిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
పేదలకు రూ. 1500 ఆర్థిక సహాయం అందించి.. విద్యుత్ బిల్లుల ద్వారా సీఎం కేసీఆర్ వడ్డీ వ్యాపారానికి తెరలేపారని షబ్బీర్ అలీ ఆరోపించారు. ప్రాణహిత చేవెళ్ల పథకం పూర్తి చేయడమే.. తన చిరకాల కోరిక అని.. రెండు లక్షల ఎకరాలకు నీరిచ్చిన తరువాతే తుదిశ్వాస వదులుతానని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం ప్రభుత్వానికి కొంత సమయమిచ్చి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోనున్నట్లు వెల్లడించారు.
ఇదీచూడండి: సీనియర్ ఐఏఎస్ అధికారి బీపీ విఠల్ కన్నుమూత