ETV Bharat / state

Folk Dancer Lasya Special Story : స్టెప్పేస్తే చాలు.. రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్​.. డ్యాన్సర్​ లాస్య గురించి ఈ విషయాలు తెలుసా..?

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2023, 6:40 PM IST

Folk Dancer Lasya Special Story : ప్రస్తుత ట్రెండ్​లో సినిమా పాటల కంటే కూడా.. జానపద పాటలకే ఎక్కువ ప్రజాదరణ లభిస్తోంది. చాలా ఫోక్​సాంగ్స్​ సామాజిక మాధ్యమాల్లో రాత్రికి రాత్రే మిలియన్ల వ్యూస్​ను సొంతం చేసుకుంటున్నాయి. అలాంటి జానపద పాటలకు కాలు కదుపుతూ ఫేమస్​ అవుతోంది కామారెడ్డికి చెందిన లాస్య. రెండేళ్లలోనే 75 జాన పదాలకు నృత్యం చేసి ఔరా అనిపించింది. పలు అవార్డులనూ అందుకుంది. జానపద నృత్యాల్లో తనకంటూ ప్రత్యేకత సాధించిన ఆ కళాకారిణి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Folk Dancer Lasya From Kamareddy
Folk Dancer Lasya Famous in Social Media
Folk Dancer Lasya Special Story స్టెప్పేస్తే చాలు రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్​ డ్యాన్సర్​ లాస్య గురించి ఈ విషయాలు తెలుసా

Folk Dancer Lasya Special Story : జాన పద పాటలు వినే చాలా మందికి ఈ అమ్మాయి సుపరిచితురాలే. ఈమె ఆడిపాడిన చాలా పాటలకు సామాజిక మాధ్యమాల్లో లక్షల వ్యూస్​ వచ్చాయి. ఇక తనను అనుసరించే వారి సంఖ్య మిలియన్లకు పైమాటే. అనతి కాలంలోనే జానపద నృత్యాల్లో తనకంటూ ప్రత్యేకతను సాధించి.. ఉత్తమ నృత్యకారిణిగా అనేక అవార్డులు సాధించింది ఈ యువ కళాకారిణి లాస్య.

డాన్స్​తో అందరినీ ఆకట్టుకుంటున్న ఈ అమ్మాయి పేరు లాస్య. కామారెడ్డి జిల్లా. తండ్రి జర్మనీలో ఉద్యోగం చేస్తుండగా.. తల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్​ నర్సుగా పని చేస్తున్నారు. లాస్యకు చిన్నప్పటి నుంచే సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండటం అలవాటు. ఈ నేపథ్యంలోనే తన వీడియోలకు నెట్టింట చక్కటి ఆదరణ వచ్చింది.

folk singer sirisha : ఆమె జానపదానికి.. లక్షల అభిమానులు

Folk Dancer Lasya From Kamareddy : లాస్య ఇంటర్నె​ట్​లో అప్లోడ్​ చేసిన డాన్స్ వీడియోలను చూసిన రంజిత్​ అనే నృత్య దర్శకుడు బంజారా పాటలో అవకాశం ఇచ్చాడు. జానపదంపై పట్టు, అవగాహన లేకున్నా అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని లాస్య అందిపుచ్చుకుంది. జానపద గీతానికి నృత్యం చేయడం తెలియకున్నా కష్టపడి నేర్చుకుంది. దాంతో తాను పడిన శ్రమకు వీక్షణల రూపంలో ఫలితం కనిపించింది.. అందరినీ మెప్పించగలిగింది

వరంగల్​ నృత్యదర్శకులు జానపద గేయాల్లో లాస్యకు అవకాశం ఇచ్చారు. అలా రంగు సీతమ్మ అనే పాటపై డాన్స్​ చేయగా.. అది ఏకంగా 47 మిలియన్ల వ్యూస్​ వచ్చి పెద్ద విజయం అందించింది. తర్వాత అదే పాటకు సీక్వెన్స్​గా వచ్చిన మరో జానపదం గేయం ఏకంగా 54 మిలియన్ల వీక్షణలతో నెట్టింట అదరగొట్టింది. దాంతో ఉభయ తెలుగురాష్ట్రాల్లో మంచి గుర్తింపు సంపాదించింది.

folk singer ganga: పాటతో నిలిచింది.. అందరి మనసు గెలిచింది!

Telangana Famous Folk Dancers : మెుదటి నుంచి సొంతంగా నృత్యం నేర్చుకుని అందరినీ మెప్పించింది లాస్య. తల్లిదండ్రులు, బంధువుల ప్రోత్సాహం తోడైంది. దీంతో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ జానపద నృత్యాల్లో నర్తిస్తూ వెళ్లింది. ఈ క్రమంలో జానపద నృత్యాలపైనా పట్టు పెరగడంతో అవకాశాలు వరుస కట్టాయి. తను చేసిన చాలా ఆల్బమ్స్​ మిలియన్ల వ్యూస్​తో దూసుకెళ్తున్నాయి. రెండేళ్లలో దాదాపుగా 75 పాటల్లో జానపద నృత్యం చేసిన లాస్య.. సోషల్​ మీడియాలో చాలా ఫేమస్​ అయ్యింది

అవకాశం వచ్చిన మొదట్లో ఇదంతా ఎందుకు అన్న మీమాంస ఉండేది. అయితే లాస్య తన ప్రతిభతో అనమానాలు పటాపంచలు చేసిందని తల్లిదండ్రులు అంటున్నారు. కళాకారిణిగా తన కూతురు సాధించిన గుర్తింపు పట్ల ఆనందంగా ఉన్నట్లు లాస్య తల్లి చెబుతోంది.

ప్రతిభతో పలు వేదికలపైనా నృత్య ప్రదర్శన ఇచ్చి అనేక అవకాశాలు అందుకుంది లాస్య. టీఎస్ఎఫ్ఎఫ్​ నుంచి ఉత్తమ నృత్యకారిణిగా అవార్డు, ఉమెన్స్​ డే సందర్భంగా నారీశక్తి అవార్డులు అందుకుంది. అయితే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా తీసుకున్న బహుమతి తనకు మరిచిపోలేని జ్ఞాపకమని చెబుతోంది. ఇక భవిష్యత్లో వైద్యురాలిగా సేవలందించడమే తన అంతిమ లక్ష్యం అంటోంది.. లాస్య

"నేను డ్యాన్స్​ వీడియో రీల్స్ చేసి నెట్​లో పెట్టాను. వరంగల్​ రంజిత్​ మాస్టర్​.. రీల్స్​ చూసి నాకు ఫోన్​ చేశారు. ఒక బంజార పాట ఉంది. డ్యాన్స్​ చేస్తారా అని అడిగారు. నాకు కెమెరా ముందు డ్సాన్స్ చేసే అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం మరచిపోలేని జ్ఞాపకం." - లాస్య, డ్యాన్సర్​

Singer Varalakshmi: జానపదాలతో ప్రత్యేక గుర్తింపు... సినిమాల్లోనూ వరుస అవకాశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.