కామారెడ్డి జిల్లాలో జోన్న రైతుల ఆందోళన కొనసాగుతోంది. మూడు రోజులుగా తెల్ల జోన్న రైతులు ఆందోళన చేస్తున్నారు. పిట్లం మండలంలోని రాంపూర్, గుర్నాపూర్, అల్లాపూర్, చిన్నకొడంగల్, తిమ్మానగర్, మార్దాండ, కంభాపూర్, కారేగాం, గోద్మెగాం గ్రామాల్లో తెల్లజోన్న సాగు చేశారు.
ఏటా కొనుగోలు చేసిన ప్రభుత్వం.. ఈసారి ముందుకు రాకపోవడం రైతులను బాధిస్తోంది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో జోన్నలు మొలక వస్తున్నాయని ఆవేదన చెందారు. నిన్న, మొన్న రాంపూర్‌లో రోడ్డుపై బైఠాయించి.. ధర్నా చేసిన రైతులు.. ఈ రోజు పిట్లం మార్కెట్ కమిటీ ఎదుట నిరసన తెలిపారు. మొక్కజోన్నకు ప్రత్యామ్నాయంగా అధికారుల సూచన మేరకు తెల్లజోన్నసాగు చేస్తే.. పట్టించుకోవడం లేదని వాపోయారు. వెంటనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: తెరాసకు ఈటల రాజేందర్ గుడ్‌బై