కామారెడ్డి జిల్లా మద్నూర్లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులోని పెసర్ల కొనుగోలు కేంద్రంలో రైతులకు సంబంధించిన పంటను కాకుండా దళారులు, వ్యాపారుల పంటను కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు నిరసనకు దిగారు. పంటను అమ్ముకునేందుకు వారం రోజుల నుంచి మార్కెట్లో పడిగాపులు కాస్తున్నా అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదంటూ రైతులు వాపోయారు. కొనుగోలు కేంద్రాన్ని ప్రైవేట్ వ్యక్తికి అప్పజెప్పడం వల్ల అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇందుకు బాధ్యులైన సహకార సంఘం కార్యదర్శి బాబురావు, తాత్కాలిక సిబ్బంది చందర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : రెండ్రోజుల కస్టడీకి ఈఎస్ఐ నిందితులు