ETV Bharat / state

Teaching: పాఠశాలకు రాకున్నా ప్రత్యక్ష బోధన... అదెలాగంటే..! - ఇస్రోజివాడి గ్రామంలో కొత్త పద్ధతిలో బోధన

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రత్యక్ష బోధనకు ఆటంకం ఏర్పడింది. బడులు తెరుచుకోవడం లేదు. కొవిడ్‌ ఉద్ధృతి పూర్తిగా తగ్గని కారణంగా ప్రభుత్వం ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకే మొగ్గుచూపింది. పేదరికం, సాంకేతిక సమస్యల కారణంగా పల్లెల్లో ప్రాథమిక విద్యార్థుల ఆన్‌లైన్‌ బోధన.. ముందుకు సాగడం లేదు. ఏడాదిన్నర నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు లేక విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు సన్నగిల్లుతున్నాయని గుర్తించారు. అందుకే కామారెడ్డి జిల్లా ఇస్రోజివాడి పాఠశాల ఉపాధ్యాయులు గ్రామానికి చెందిన యువత, పూర్వవిద్యార్థుల సహకారంతో ‘ఈచ్‌ వన్‌-టీచ్‌ ఫైవ్‌’ పేరిట ప్రత్యక్ష బోధనకు శ్రీకారం చుట్టారు. పూర్వకాలంలో ఏర్పాటు చేసిన వీధిబడుల మాదిరిగానే ఉదయం, సాయంత్రం వేళల్లో చిన్నారులకు అక్షరాలు దిద్దిస్తున్నారు.

Teaching
ప్రత్యక్ష బోధన
author img

By

Published : Jul 22, 2021, 8:48 AM IST

కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం ఇస్రోజివాడి ప్రాథమిక పాఠశాలలో 135 మంది విద్యార్థులు ఉన్నారు. గత ఏడాదిన్నరగా ప్రత్యక్ష బోధన లేకపోవడంతో విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యం పడిపోతుంది. ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు ఉపాధ్యాయులకు అర్థమైంది. పేద విద్యార్థులకు టీవీలు, స్మార్ట్ ఫోన్​లు అందుబాటులో లేకపోవడంతో ఆన్​లైన్ తరగతులకు అంతంత మాత్రంగానే హాజరవుతున్నట్లు గుర్తించారు. వీరి ఇబ్బందులను తొలగించాలంటే ప్రత్యక్ష తరగతులే పరిష్కారమని భావించారు. అయితే కొవిడ్ కారణంగా పాఠశాలలో ప్రాథమిక స్థాయిలో బోధించలేని పరిస్థితి నెలకొంది. అందుకే ఓ సరికొత్త ఆలోచన చేశారు. విద్యార్థులకు పాఠశాలలో కాకుండా ఇంటి దగ్గరే ప్రత్యక్ష బోధన అందేలా చర్యలు తీసుకున్నారు. పూర్వ విద్యార్థుల సహకారంతో ఒకరు మరో ఐదు మందికి బోధించాలంటూ నూతన పంథాకు శ్రీకారం చుట్టారు.

ప్రత్యక్ష బోధన

నాకు పాఠశాలకు వెళ్లడం అంటే ఇష్టం. కరోనా రావడం వల్ల వెళ్లలేకపోతున్నాను. స్కూలుకు వెళ్లే సమయంలో నాకు పది ఎక్కాలు వచ్చు. కానీ కరోనా సమయంలో అక్క వాళ్ల దగ్గరకి వెళ్లి చదువుకోమని మా టీచర్స్ చెప్పారు. రోజూ నేను తరగతులు వింటున్నాను. ఇప్పుడు నేను 20 ఎక్కాలు నేర్చుకున్నాను.

-విద్యార్థిని

ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు గ్రామంలో మూడ్రోజుల పాటు తిరిగి... పూర్వ విద్యార్థులను సమీకరించారు. ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు, చదువుకున్న గృహిణులు, వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులు.. ఇలా విద్యావంతులై గ్రామంలోనే ఉన్న వారిని కలిశారు. రోజుకో గంట సమయం కేటాయించి చిన్నారులకు బోధించాలని కోరగా... 22 మంది ముందుకొచ్చారు. ఒక్కొక్కరికి ఐదు నుంచి ఎనిమిది మంది విద్యార్థులను కేటాయించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో అక్షరాలు నేర్పించాలని సూచించారు. ఒక వీధికి సంబంధించిన విద్యార్థులను అదే ప్రాంతంలోని వాలంటీర్ బోధించేలా ఏర్పాట్లు చేశారు. ఇలా గ్రామంలో వీధికో బడి ఏర్పడింది. ఇంటి ముందు అరుగుల మీద, అనువైన స్థలంలో నెల రోజుల నుంచి విద్యార్థులకు ప్రత్యక్ష బోధన కొనసాగుతోంది. ఏ రోజు ఏం బోధించాలనే దానిపై పూర్వ విద్యార్థులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తున్నారు. వారం రోజులకోసారి నేర్చుకున్న అంశాలపై రాతపరీక్షలు నిర్వహించి అభ్యసన ప్రగతిని సమీక్షిస్తున్నారు. ప్రత్యక్షంగా పాఠాలు చెప్పడం వల్ల పాఠశాలకు వెళ్లినట్లే అనిపిస్తోందని విద్యార్థులు చెబుతున్నారు. తమవంతు సాయంగా పాఠాలు చెప్పడం సంతోషంగా ఉందని వాలంటీర్లు పేర్కొంటున్నారు.

స్కూలు టీచర్స్ వచ్చి విద్యార్థులకు బోధించమని చెప్పడంతో నేను కూడా ఓకే చెప్పాను. ఇంట్లో పని చేసుకుని పిల్లలు వచ్చే సమయానికి సిద్ధంగా ఉంటాను. నాకు వచ్చినంత వరకు వాళ్లకి క్లాస్​లు తీసుకుంటాను.

-గృహిణి

గ్రామానికి చెందిన ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉన్నత చదువులు కొనసాగిస్తున్న వారు తమ ఇంటి సమీపంలో చిన్నారులకు పాఠాలు బోధిస్తున్నారు. ఇంటర్‌, డిగ్రీ చదివిన విద్యార్థులతో పాటు సాంకేతిక, వైద్య విద్యనభ్యసించే విద్యార్థులూ ముందుకు రావడం గమనార్హం. ముఖ్యంగా అమ్మాయిలే ఎక్కువ సంఖ్యలో పాఠాలు బోధించేందుకు ముందుకొచ్చారు. కొందరు గృహిణిలు సైతం తమవంతు బాధ్యతగా చిన్నారులకు పాఠాలు చెబుతున్న తీరు అభినందనీయమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆన్​లైన్ బోధనే సాగుతున్నా.. అందుకు సరిపడా వసతులు లేక చాలా మంది పిల్లలు పాఠాలకు దూరమవుతున్నారు. కానీ ఇస్రోజివాడి పాఠశాల ఉపాధ్యాయులు చేసిన ఆలోచన.. విద్యార్థుల సమస్యను దూరం చేస్తోంది. కరోనా నిబంధనలు పాటిస్తూనే... ఐదారుగురు విద్యార్థులకు కలిపి బోధన అందిస్తున్నారు. దీనివల్ల పిల్లల్లో పాఠ్యాంశాలపై ఆసక్తి పెరిగి అభ్యసన సామర్థ్యాలు మెరగవుతున్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

వీధి బడులను చూసి వృద్ధులు పాతరోజులు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. పూర్వం కానికబడి పేరిట పంతుళ్లు ఇంటి ముంగిటే పాఠశాలను ఏర్పాటు చేసి.. వీధిలోని విద్యార్థులకు అక్షరాలు నేర్పించేవారు. ప్రస్తుతం కరోనా కారణంగా అదే విధంగా చిన్నారులకు బోధిస్తున్నారు.

ఇదీ చూడండి: Corona: తల్లిదండ్రులను కోల్పోయిన లక్షల మంది చిన్నారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.