కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అన్ని వీధులు, ప్రధాన రహదారులను పోలీసులు డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. లాక్డౌన్పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని సూచనలు చేసినా చాలామంది అవేమీ తమకు పట్టనంటూ రోడ్ల మీద తిరుగుతున్నారు. మాస్కులు ధరించకుండా, జనాలు గుమిగూడి మాట్లాడటం, భౌతిక దూరం పాటించకపోవడం చేస్తున్నారు. అలాంటి వారిపైడ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షించి పోలీసులు చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నారు.
లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన 242 వ్యాపార సంస్థలపై కేసులు నమోదు చేశారు. 3,950 మందికి జరిమానా విధించారు. 991 వాహనాలను సీజ్ చేశారు. లాక్డౌన్ మినహాయింపు సమయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: Mango Farmers: లాక్ డౌన్ ప్రభావం.. మామిడి రైతులకు తీరని నష్టం