కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి మద్యం బానిసలు క్యూ కడుతున్నారు. కల్లు, మద్యం దొరక్క.. ఫిట్స్ వచ్చి, పిచ్చి చేష్టలతో దవాఖానాకు వచ్చే వారే సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భిక్నూర్ మండలం రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఫిట్స్ వచ్చి కిందపడగా.. అతనికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
దేవునిపల్లి గ్రామానికి చెందిన మరో వ్యక్తి చెరువులో దూకడానికి వెళ్లాడు. స్థానికులు పట్టుకుని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ కారణంతోనే ఆరోగ్య సమస్యలతో ఇప్పటి వరకు కామారెడ్డి 27 కేసులు ఆసుపత్రికి వచ్చాయి. ఇందులో 25 ఏళ్లలోపు వారు ఐదుగురు ఉన్నారు.
ఇవీ చూడండి: కరోనా పేరుతో సైబర్ మోసాలు- ఈ జాగ్రత్తలు తప్పనిసరి...