కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని నాలుగో వార్డు బీసీ కాలనీలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లకు మంజూరైన 217 పట్టాలకు అదనంగా మరో 40 పట్టాలు సృష్టించి మోసానికి తెరలేపారని సభాపతి పేర్కొన్నారు. రెవెన్యూ రికార్డులో 217 మందికి పట్టాలు జారీ అయినట్లు నమోదైందనీ... కానీ అదనంగా 40 పట్టాలు ఎక్కడి నుంచి వచ్చాయని ఆరా తీయగా అసలు విషయం బయటపడిందని అన్నారు. ఖంగు తిన్న అధికారులు ఆ 40 పట్టాలు నకిలీవని గుర్తించారు.
గతంలో పట్టాలు వచ్చిన వారికి ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటన వెలువడడం వల్ల కొందరు ఇదే అదునుగా నకిలీ పత్రాలు సృష్టించి దరఖాస్తు చేసుకున్నారు. ఈ అంశంపై స్పీకర్ పోచారం.. విచారణ చేసి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆర్డీవోకు ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చూడండి : సాదాసీదా పావురం కాదది.. చెన్నై పందేల పావురం..!