మహారాష్ట్రలో కొవిడ్ కేసులను దృష్టిలో పెట్టుకుని సరిహద్దు జిల్లాల అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మళ్లీ వైరస్ విజృంభించడంతో రాష్ట్రంలోకి వచ్చేవారికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సలాబత్పూర్ పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
కరోనా లక్షణాలు ఉంటే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తామని అధికారులు తెలిపారు. కొవిడ్ కట్టడి కోసం మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనదారులు, ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.