రైతు వేదిక భవనాల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఎ.శరత్ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లా రాజంపేట, కొండాపూర్ గ్రామాల్లోని రైతు వేదిక భవనాల నిర్మాణ పనులను బుధవారం పరిశీలించారు. సెప్టెంబర్ 7లోగా పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రాజంపేటలో పల్లె ప్రకృతి వనంలో 5 వేల మొక్కలు నాటాలని తెలిపారు.
కొండాపూర్‌లోని పల్లె ప్రకృతి వనంలో పెద్ద మొక్కలు నాటాలని కలెక్టర్ సూచించారు. హరిత హారంలో నాటిన మొక్కలను సంరక్షించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్గొండ గ్రామంలో ఒక మహిళ తనకు ఇల్లు కట్టుకోవడానికి నిధులు మంజూరు చేయాలని కలెక్టర్‌ను కోరగా.. సానుకూలంగా స్పందించారు.
అనంతంర బసన్నపల్లిలో కంపోస్టు షెడ్డును పరిశీలించారు. తడి, పొడి చెత్త ద్వారా సేంద్రీయ ఎరువులు తయారు చేయాలని పేర్కొన్నారు. తద్వారా గ్రామ పంచాయతీ ఆదాయాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, డీపీవో నరేష్, రాజంపేట సర్పంచ్ సౌమ్య, ఎంపీడీవో విజయ్ కుమార్, తహసీల్దార్ మోతిసింగ్, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీచూడండి.. తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు