విధి నిర్వహణలో ఉన్న ఓ ఏఆర్ కానిస్టేబుల్ తన సర్వీస్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించింది. జిల్లా కోశాగారం వద్ద గార్డ్ డ్యూటీ నిర్వహిస్తున్న శ్రీనివాస్‌గౌడ్ విధులు నిర్వర్తిస్తున్నాడు. ఉన్నట్టుండి తుపాకీతో కాల్చుకున్నాడు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో హైదరాబాద్‌కు తరలించారు. జిల్లా ఎస్పీ శ్వేత, డీఎస్పీ లక్ష్మీనారాయణ జిల్లా కేంద్ర ఆసుపత్రికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు. వ్యక్తిగత కారణాలే ఆత్మహత్యాయత్నానికి కారణమని పోలీసులు చెబుతున్నారు.
ఇవీ చూడండి: ఖమ్మంలో తెరాస, కాంగ్రెస్ శ్రేణుల రాళ్లదాడి