కామారెడ్డి జిల్లా ఉగ్రవాయి గ్రామంలో జిల్లా పాలనాధికారి డాక్టర్ శరత్ కుమార్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. గ్రామంలో పలుచోట్ల పర్యటించి పారిశుద్ధ్య కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు.
హరితహారంలో భాగంగా మొక్కలు పెంచడం వాటిని సంరక్షించడంపై చేపడుతున్న చర్యల గురించి అధికారులను ఆరా తీశారు. అంతేగాక గ్రామంలో మురుగునీటి వ్యవస్థ పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆయన సూచించారు.
ఇదీ చదవండి: కేబినెట్ భేటీపై నేడు నిర్ణయం.. లాక్‌డౌన్‌పై చర్చ!