ETV Bharat / state

బడిలో ఒక్క మొక్క కూడా లేదా..? టీచర్లపై కలెక్టర్ ఆగ్రహం..​ - బాలుర ఉన్నత పాఠశాల

రామారెడ్డి కేంద్రంలోని జిల్లా పరిషత్​ బాలుర ఉన్నత పాఠశాలను కామారెడ్డి జిల్లా పాలనాధికారి ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో మొక్కలు లేకపోవడం చూసి ప్రధానోపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Collector Sarath Kumar suddenly visited the zpbh school and outraged the teachers for not having plants in the school in Kamareddy
బడిలో ఒక్క మొక్క కూడా లేదా..? టీచర్లపై కలెక్టర్ ఆగ్రహం..​
author img

By

Published : Mar 11, 2020, 5:39 PM IST

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను జిల్లా పాలనాధికారి శరత్ కుమార్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో ఒక మొక్క కూడా లేకపోవడం వల్ల ప్రధానోపాధ్యాయుడిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

బడిలో ఒక్క మొక్క కూడా లేదా..? టీచర్లపై కలెక్టర్ ఆగ్రహం..​

పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం గురించి తెలుసుకున్నారు. 103 విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తుండగా కేవలం 95 మందికే కోడిగుడ్లు అందించడంపై మండిపడ్డారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలపై ఆరాతీశారు.

ఇదీ చదవండి : 4వ తరగతి పాసైన బామ్మలకు.. నారీశక్తి పురస్కారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.