కరోనా వాక్సిన్ డ్రైరన్ కార్యక్రమంలో భాగంగా .. కామారెడ్డి జిల్లా గాంధారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ శరత్ కుమార్ పరిశీలించారు. వెయిటింగ్ రూమ్, వాక్సినేషన్ రూమ్, అబ్సర్వేషన్ రూమ్ల నిర్వాహణ సరిగా లేకపోవటంతో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
విధుల నిర్వాహణలో నిర్లక్ష్యం వహించినందుకు గాను.. గాంధారి మెడికల్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ను మద్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బదిలీ చెయ్యాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు.
ఇదీ చదవండి: తల్లి, చెల్లిపైకి ట్రాక్టర్ ఎక్కించి.. ఇనుప రాడ్తో కొట్టి..