ప్రజలు సంతోషంగా పండగ జరుపుకోవలన్నదే సీఎం ఆలోచనని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని ఫిలడెల్ఫీయా చర్చిలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్సీ రాజేశ్వర్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. పేద క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలను పంపిణీ చేసి ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేదని తెలిపారు.
గతంలో లేని విధంగా..
బడుగు బలహీన వర్గాల వారికి తెరాస ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని ఎమ్మెల్సీ రాజేశ్వర్ తెలిపారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలోని పేద ప్రజలకు రంజాన్, బతుకమ్మ, క్రిస్మస్ పండుగలకు నూతన వస్త్రాలు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాల్ రావు, మున్సిపల్ ఛైర్మన్ నిట్టు జాహ్నవి, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: డీజీపీ