కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్.. కారును అదుపు చేయలేకపోవడంతో సిరిసిల్ల రోడ్డులో ఉన్న ఓ దుకాణంలోకి దూసుకెళ్లింది. కారు ఢీ కొన్న వేగానికి అక్కడే ఉన్న విద్యుత్ స్తంభం విరిగింది. ఉదయం జన సంచారం లేకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.
ఈ ప్రమాదంలో కారు ముందుభాగం పూర్తిగా ధ్వంసం కాగా.. డ్రైవర్‌కు స్పల్ప గాయాలయ్యాయి. అయితే డ్రైవర్ అక్కడి నుంచి పరారవ్వగా.. పోలీసులు అతడ్ని పట్టుకుని స్టేషన్‌కు తరలించారు.
ఇవీ చూడండి: కన్నతల్లా.. కసాయా..! రోడ్డుపై పసికందును వదిలేసింది..