కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో నిర్మించిన రైతువేదికకు ప్రధాని చిత్రపటం పెట్టకపోవడాన్ని నిరసిస్తూ.. భాజపా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రాష్ట్రంలో రైతువేదికల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.10లక్షల చొప్పున కేటాయించిందని భాజపా కార్యకర్తలు తెలిపారు. అలాంటప్పుడు భవనంపై ప్రధాని మోదీ చిత్రపటాన్ని ఎందుకు పెట్టలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజంపేటలో నిర్మించిన రైతువేదిక నిర్మాణానికి కేంద్రం అందించిన సాయంతో పాటుగా గ్రామ పంచాయతీ నిధుల నుంచి రూ. 5 లక్షలు తీసుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరిసిస్తూ... పోలీసులు నిలువరించినా పట్టించుకోకుండా కార్యకర్తలు రైతువేదిక భవనం పైకి ఎక్కి మోదీ ఫోటోను అతికించారు.
ఇదీ చూడండి: 'తెరాస సర్కారు నిరుద్యోగులను మోసం చేసింది'