ETV Bharat / state

'ఈ పుట్టినరోజు ప్రకృతి పరిరక్షణకు అంకితం' - celebrations

సాధారణంగా పుట్టినరోజు అంటే పార్టీలు, కేక్ కట్టింగ్ వంటివి చేస్తారు. కానీ కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ వ్యాపారి లక్ష రూపాయల విలువ చేసే మొక్కలు నాటారు. గ్రంథాలయానికి రెండు లక్షల రూపాయల విలువైన పుస్తకాలు అందించారు.

బర్త్​డే రోజు 3 లక్షల విలువైన కార్యక్రమాలు
author img

By

Published : Aug 12, 2019, 9:04 AM IST

కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామ గ్రామానికి చెందిన వ్యాపారి సుభాష్​రెడ్డి తన పుట్టినరోజును హరితోత్సవంగా జరుపుకున్నారు. లక్ష రూపాయల విలువ చేసే 2500 బోగన్ విల్లా హైబ్రిడ్ రకం పూల మొక్కలు హైదరాబాద్ నుంచి తెప్పించి రోడ్డుకు ఇరు వైపులా నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పాల్గొన్నారు. గ్రామ గ్రంథాలయానికి రెండు లక్షల రూపాయల విలువైన పుస్తకాలు అందించారు. భావితరాల కోసం ఆలోచించిన సుభాష్​రెడ్డిని గ్రామస్థులు అభినందించారు.

బర్త్​డే రోజు 3 లక్షల విలువైన కార్యక్రమాలు

ఇదీ చూడండి : భాజపాలోకి వలసల పరంపర

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.