ETV Bharat / state

కరోనా సాయం.. వీధివిక్రేతలకు ఆత్మనిర్భర భారత్​ నిధి

కరోనా కాలంలో ప్రజలకు ఆర్ధిక బలం చేకూర్చడానికి ప్రధాని ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర భారత్​ పథకం కింద కామారెడ్డిలోని 100 మందికిపైగా వీధి వ్యాపారస్థులకు ఒక్కొక్కరికీ రూ.పదివేలు ఋణం మంజూరు చేసినట్టు జిల్లాలోని యూనియన్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా తెలిపింది.

atma nirbhar funds issued to the street vendors at kamareddy
ఆ జిల్లాలో 100 మందికిపైగా వీధివిక్రేతలకు ఆత్మనిర్భర భారత్​ నిధి
author img

By

Published : Jul 3, 2020, 12:20 PM IST

ఆత్మ నిర్భర భారత్ నిధి పథకం కింద కేంద్ర ప్రభుత్వం వీధి విక్రేతలకు రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. అందులో భాగంగా కామారెడ్డిలోని యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా సిరిసిల్ల రోడ్డు బ్రాంచ్​.. 100 మందికిపైగా వీధి విక్రేతలకు ఒక్కొక్కరికి రూ.10 వేల రూపాయల చొప్పున ఋణం మంజూరు చేసింది.

ఈ లోన్​కి వడ్డీ సబ్సిడీ కింద 7 శాతం గవర్నమెంట్ భరిస్తుంది. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా విలయతాండవం చేస్తుండడం వల్ల చిరు వ్యాపారులు, వీధి విక్రేతలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకం తమకు కొంత ఆర్థిక బలాన్ని కలిగిస్తుందని వీధి వ్యాపారస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: తహసీల్దార్ కార్యాలయంలో అన్నదమ్ముల ఆత్మహత్యాహత్నాం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.