బోధన్ ఎమ్మెల్యే షకీల్ తీరుకు నిరసనగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఆర్యవైశ్య సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఆందోళనలో భాగంగా పట్టణంలోని ఆర్యవైశ్య వ్యాపార సముదాయాలు మూసివేసి బంద్ పాటించింది.
పట్టణానికి చెందిన వ్యాపారి రుద్రంగి మురళీధర్ గుప్తా.. ఎమ్మెల్యే షకీల్‌తో చేసుకున్న ఒప్పందం మేరకు రంజాన్ పండుగ కోసం తోఫా కిరాణా సామాను సరఫరా చేసినట్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాత బాలకృష్ణ తెలిపారు. వాటికి సంబంధించిన డబ్బులు ఎమ్మెల్యే షకీల్ ఇవ్వకపోగా.. అసభ్యకర పదజాలంతో దూషించినట్లు వివరించారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. బాధితుడికి మద్దతుగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ విషయమై రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా.. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితకు ఫిర్యాదు చేయనున్నట్టు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: విమానాశ్రయంలో క్యాబ్ డ్రైవర్ ఆత్మాహుతి