ETV Bharat / state

రైల్వేరంగ ప్రైవేటీకరణను రద్దు చేయాలి: ఏఐటీయూసీ

రైల్వే రంగాన్ని ప్రైవేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కామారెడ్డి రైల్వే స్టేషన్ ముందు ఏఐటీయూసీ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్టేషన్ సూపరింటెండెంట్​కు వినతిపత్రం అందజేశారు.

aituc leaders protest in front railway station in kamareddy
రైల్వేరంగ ప్రైవేటీకరణను రద్దు చేయాలి: ఏఐటీయూసీ
author img

By

Published : Jul 18, 2020, 2:49 PM IST

కేంద్రప్రభుత్వం రైల్వే రంగాన్ని ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ కామారెడ్డిలోని రైల్వేస్టేషన్​ ఎదుట ఏఐటీయూసీ నాయకులు ధర్నా చేపట్టారు. అనంతరం స్టేషన్ సూపరింటెండెంట్ సూరజ్​కి వినతిపత్రం అందజేశారు. దేశంలో బ్రిటిష్ పరిపాలనలో కూడా రైల్వేలు బ్రిటిష్​ ప్రభుత్వ అధీనంలో నడిచేవని.. స్వతంత్రం తరువాత రైల్వే సంస్థ మొత్తంగా మన ప్రభుత్వపరం అయిందని అని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్ఆర్ శేఖర్ తెలిపారు.

ఆ నాటి నుంచి నేటి వరకు కేంద్రంలో ఉన్న పాలకులు రైల్వేను అనేక రకాలుగా అభివృద్ధి చేశారే కాని ఇలా ప్రైవేటుపరం చేయలేదని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు భాజపా ప్రభుత్వం రైల్వేరంగాన్ని ప్రైవేటీకరణ చేయాలని చూడడం సిగ్గు చేటని విమర్శించారు. వెంటనే ఈ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని లేని ఎడల ఆందోళనను ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

ఇదీ చూడండి : రాష్ట్రంలో 42 వేలు దాటిన కరోనా కేసులు.. 400పైగా మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.