ETV Bharat / state

అత్యాచార నిందితున్ని తక్షణమే శిక్షించాలి: ఏబీవీపీ - అత్యాచార నిందితున్న శిక్షించాలంటూ కలెక్టరేట్​ను ముట్టడించిన ఏబీవీపీ

మైనర్​ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడైన తెరాస నాయకుడు అసిఫ్​ను తక్షణమే శిక్షించాలని ఏబీవీపీ డిమాండ్​ చేసింది. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవైందని కామారెడ్డి ఏబీవీపీ కన్వీనర్​ మనోజ్​ ఆరోపించారు. నిందితునిపై చర్యలు తీసుకోకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బాలికకు న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టరేట్​ను ముట్టడించారు.

ABVP demands to minor girl Rape accused trs leader asif  should be punished immediately in kamareddy district
అత్యాచార నిందితున్ని తక్షణమే శిక్షించాలి: ఏబీవీపీ
author img

By

Published : Mar 22, 2021, 5:53 PM IST

మైనర్​పై అత్యాచారం కేసులో తెరాస నాయకుడు అసిఫ్​ను వెంటనే ఉరితీయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. బాలికకు న్యాయం చేయాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టరేట్​ను ముట్టడించారు. దీంతో పోలీసులకు, ఏబీవీపీ కార్యకర్తలకు కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. విద్యార్థులు అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

నిందితున్ని కఠినంగా శిక్షించాలి: ​ మనోజ్

ఫాస్ట్​ ట్రాక్​ కోర్టు ద్వారా విచారణ చేసి బాలికపై అత్యాచారానికి పాల్పడిన అసిఫ్​ను కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ కన్వీనర్​ మనోజ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. బాలికకు తక్షణమే రూ.10 లక్షల ఎక్స్​గ్రేషియా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పోలీసు వ్యవస్థ పకడ్బందీగా పని చేస్తున్నా అమ్మాయిలు, మహిళలపై అత్యాచారాలు ఎలా జరుగుతున్నాయని ప్రశ్నించారు. అనంతరం కొంతమంది విద్యార్థులు కలెక్టరేట్​ ఏవోకు వినతిపత్రాన్ని అందజేశారు.

ఇదీ చూడండి: మైనర్​ బాలికపై అత్యాచారం.. కేసు నమోదు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.