ETV Bharat / state

కామారెడ్డి కొత్త మాస్టర్‌ ప్లాన్‌ ముసాయిదాపై రగడ.. రద్దు కోరుతూ ఆందోళనలు

కామారెడ్డిలో కొత్త మాస్టర్‌ ప్లాన్‌ ముసాయిదాపై రగడ మొదలైంది. విలీన గ్రామాల్లోని రైతులతో ఎలాంటి సంప్రదింపులు చేయకుండా 1,200 ఎకరాలను పారిశ్రామిక జోన్‌గా ప్రతిపాదించడంతో బాధితులు రోడ్డెక్కారు. ఆయా గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మాస్టర్ ప్లాన్ రద్దు కోరుతూ దశల వారీగా నిరసనలు చేస్తున్నారు.

New Master Plan On Draft in Kamareddy
New Master Plan On Draft in Kamareddy
author img

By

Published : Dec 27, 2022, 12:57 PM IST

రాష్ట్ర సర్కారు ఆదేశాల మేరకు కామారెడ్డి మున్సిపాలిటీ బృహత్‌ ప్రణాళికను దిల్లీకి చెందిన ఓ సంస్థతో ఇటీవల తయారు చేయించారు. కామారెడ్డి పట్టణంతో పాటు విలీన గ్రామాలైన అడ్లుర్, టెకిర్యాల్ , కాల్సిపూర్, దేవునిపల్లి, లింగాపూర్, సరంపల్లి, పాతరాజంపేట, రామేశ్వరపల్లిని కలుపుకుని 61.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మాస్టర్ ప్లాన్ ముసాయిదా తయారు చేశారు.

మొత్తం పట్టణాన్ని ఇండస్ట్రియల్, గ్రీన్, కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్లుగా విభజించి.. ఆ వివరాలను ఈ మధ్యే ప్రకటించారు. 2023 జనవరి 11 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు చెప్పారు. పారిశ్రామిక జోన్ కోసం 1200 ఎకరాలతో 8.5 శాతం ప్రతిపాదించారు. ఇందులో నేషనల్ హైవే పక్కన పచ్చని పంటలు పండే.. అడ్లూర్, ఇల్సిపూర్, టెకిర్యాల్, అడ్లుర్ ఎల్లారెడ్డి రైతులకు చెందిన 900 ఎకరాల భూములను చూపారు.

దీనివల్ల ఈ భూములు రెసిడెన్షియల్ కింద పనికిరావని చెప్పకనే చెప్పినట్లయ్యింది. దీంతో ఈ భూములకు ఒక్కసారిగా డిమాండ్ పడిపోయింది. భవిష్యత్‌లో ఇళ్ల నిర్మాణం కూడా కష్టమవుతుందని భావించిన రైతులు ఆందోళనబాట పట్టారు. మరోవైపు కామారెడ్డి పట్టణం జనాభాకు అనుగుణంగా రోడ్ల విస్తరణ చేపట్టని అధికారులు.. విలీన గ్రామాలైన లింగాపూర్, దేవునిపల్లి, టెకిర్యాల్​లో మాత్రం 100 ఫీట్ల రోడ్లను ప్రతిపాదించారు.

వీటిని అధికార పార్టీ నాయకులు.. చేసిన వెంచర్లకు అనుకూలంగా ఉండేలా ఏకపక్షంగా ప్రతిపాదన చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో విలీన గ్రామాల రైతులు ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి ఇప్పటికే 300కు పైగా అభ్యంతరాలను మున్సిపాలిటీలో అందజేశారు. కలెక్టరేట్, మున్సిపల్ ఆఫీసుల ఎదుట ఆందోళన చేశారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇంటిని ముట్టడించారు. మాస్టర్ ప్లాన్ వద్దంటూ వందల మంది రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఒకరు పారిశ్రామిక జోన్‌ ఎత్తేయాలని, మరొకరు రోడ్ల విస్తరణను కుదించాలని రైతులు డిమాండ్‌ చేయడంతో అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్తారో వేచిచూడాలి.

కామారెడ్డిలో కొత్త మాస్టర్‌ ప్లాన్‌.. రద్దు కోరుతూ రైతుల నిరసనలు..!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.