ETV Bharat / state

జోగులాంబ అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ - జోగులాంబ ఆలయం తాజా వార్తలు

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ జోగులాంబ అమ్మవారికి జడ్పీ ఛైర్​పర్సన్ సరిత కుటుంబ సమేతంగా పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రజలందరినీ చల్లంగా చూడు తల్లీ అంటూ అమ్మవారిని వేడుకున్నారు.​

Zp Chairperson Sarita presented the silk saree to Jogulamba devi
జోగులాంబ అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ
author img

By

Published : Oct 23, 2020, 5:35 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లోని శ్రీ జోగులాంబ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా జడ్పీ ఛైర్​పర్సన్ సరిత కుటుంబ సమేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ప్రేమ్​కుమార్, అర్చకులు ఛైర్​పర్సన్​కు పూర్ణ కుంభ స్వాగతం పలికారు.

ముందుగా స్వామి వారిని దర్శించుకుని అభిషేకం చేశారు. అనంతరం పట్టు వస్త్రాలతో జోగులాంబ ఆలయం చేరుకొని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మ వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

ఇదీ చూడండి.. రెండోరోజు బ్రహ్మచారిణి అవతారంలో జోగులాంబ అమ్మవారి దర్శనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.