డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ద్వారా పేదవాడి సొంతింటి కలను తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చబోతుందని గద్వాల శాసనసభ్యుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. గద్వాలలో 30 ఎకరాలలో నిర్మస్తున్న రెండు పడక గదుల ఇళ్లను ఆయన పరిశీలించారు. పట్టణంలోని పేద ప్రజలకు కోసం సుమారు రెండు వేల ఇళ్లను నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. 500 ఇళ్లను పూర్తిచేసి 2 నెలల్లో ప్రజలకు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. త్వరలో ఈ ఇళ్లను పూర్తి చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ చేత ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: 'మహీ.. మరిన్ని విజయాలతో సాగిపో...'