ETV Bharat / state

వేద మంత్రోచ్ఛారణల నడుమ తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం

వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ తుంగభద్ర పుష్కరాలు సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ వద్ద మాధవా నందస్వామి, కమలానందభారతి స్వామిజీ పుష్కరాలను ప్రారంభించారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్... హాజరై తుంగభద్రా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు.

వేద మంత్రోచ్ఛారణల నడుమ తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం
వేద మంత్రోచ్ఛారణల నడుమ తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం
author img

By

Published : Nov 20, 2020, 7:55 PM IST

తుంగభద్ర నదీ పుష్కరాలు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 1 వరకు పుష్కరాలు జరగనున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా తుంగభద్రకు పుష్కరాలు వచ్చాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో తుంగభద్ర నది 65 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. జిల్లాలో నాలుగు చోట్ల పుష్కర ఘాట్లు ఏర్పాటు చేశారు. అలంపూర్, రాజోలి, పుల్లూరు, వేణిసోంపూర్ లో పుష్కర ఘాట్లలో సౌకర్యాలు కల్పించారు.

వేద మంత్రోచ్ఛారణల నడుమ తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం

శాస్త్రోక్తంగా పూజలు...

అలంపూర్‌ వద్ద ఘాట్‌లో కీసర పీఠాధిపతి కమలానంద భారతి, తొగుట పీఠాధిపతి మధుసూదనంద స్వామి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పుష్కరాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరై పూజలు చేశారు. తుంగభద్ర నదిలో పుష్కర స్నానాలు చేసి జోగులాంబను దర్శించుకున్నారు.

అన్ని ఏర్పాట్లు...

పుష్కరాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నదిలో ప్రమాదాల బారిన పడకుండా బోట్లను అందుబాటులో ఉంచారు. పుష్కరఘాట్లలో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అత్యవసరమైతే ఆదుకునేందుకు గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు.

రిపోర్టు చూపిస్తేనే...

కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు పుష్కరాలు నిర్వహించుకోవాలని మంత్రులు సూచించారు. కొవిడ్ నెగెటివ్ రిపోర్టు చూపిస్తేనే భక్తులను ఘాట్లలోకి అనుమతించారు. లేదంటే థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి సాధారణ ఉష్ణోగ్రతలు ఉన్నవారిని మాత్రమే పుష్కర ఘాట్లలోకి పంపించారు.

ప్రత్యేక బస్సులు...

డిసెంబర్ 1 వరకు జరిగే తుంగభద్ర పుష్కరాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. తుంగభద్ర పుష్కరాలకు పోలీస్ శాఖ సైతం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. సుమారు రెండు వేల సిబ్బందిని నియమించింది.

ఇదీ చూడండి: తుంగభద్ర పుష్కరాలకు కట్టుదిట్టమైన భద్రత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.