జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు టీఆర్టీ-2017అభ్యర్థులకు వెంటనే నియామక ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక ఉపాధ్యాయులపై వివక్ష చూపుతోందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపించాయి. 2012లో ఉమ్మడి రాష్ట్రంలో డీఎస్సీ తర్వాత ఐదేళ్లకు తెలంగాణ ప్రభుత్వం 2017లో నోటిఫికేషన్, 2018లో పరీక్ష 2019లో ఫలితాలు విడుదల చేస్తే.. మరి పోస్టింగులు ఎప్పుడని అభ్యర్థులు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. పాఠశాలల ప్రారంభ సమయానికి పోస్టింగులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నియామకాలు త్వరగా చేపట్టకపోతే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని ఉపాధ్యాయ సంఘాల నాయకులు హెచ్చరించారు.
ఇవీ చూడండి: విద్యార్థికి 168 చెంపదెబ్బలు- టీచర్ అరెస్ట్