ETV Bharat / state

నేటి నుంచి తుంగభద్ర పుష్కరాలు.. ఏర్పాట్లు పూర్తి

కొవిడ్​ నిబంధనల మేరకుకు తుంగభద్ర పుష్కరాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట ఇరవై నిమిషాలకు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో... మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. జిల్లాలో నాలుగు చోట్ల పుష్కర ఘాట్లు ఏర్పాటు చేశారు.

నేటి నుంచి తుంగభద్ర పుష్కరాలు.. ఏర్పాట్లు పూర్తి
నేటి నుంచి తుంగభద్ర పుష్కరాలు.. ఏర్పాట్లు పూర్తి
author img

By

Published : Nov 20, 2020, 4:07 AM IST

Updated : Nov 20, 2020, 6:30 AM IST

తుంగభద్ర పుష్కరాల కోసం సర్వం సన్నద్ధమైంది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో... ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాలకు పుష్కరాలను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ సైతం హాజరుకానున్నారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ సంప్రదాయబద్ధంగా పుష్కరాలకు అంకురార్పణ చేయనున్నారు. పుష్కరాల కోసం జోగులాంబ గద్వాల జిల్లాలో... అలంపూర్, రాజోలి, పుల్లూరు, వేణిసోంపూర్​లో ఘాట్​లు ఏర్పాటు చేశారు.

రిపోర్ట్​ ఉంటేనే..

ఇటీవల వైద్యులు ఇచ్చిన కొవిడ్​ నెగిటివ్​ రిపోర్ట్​ చూపిస్తేనే... ఘాట్లలోకి అనుమతించనున్నట్టు అధికారులు చెబుతున్నారు. రిపోర్టు లేనివారికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి సాధారణ ఉష్ణోగ్రతలు ఉంటేనే ఘాట్, ఆలయాలకు అనుమతించనున్నారు. ఇక ఘాట్ వద్ద స్నానాలు దుస్తులు మార్చుకునే గదులు, మంచినీళ్లు మరుగుదొడ్లు, ఇతర సదుపాయాలు కల్పించారు. ఆలయాల్లోనూ భౌతికదూరం పాటించేలా క్యూ లైన్లు సిద్ధమయ్యాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పుష్కరాలు జరగనున్నాయి .

నిబంధనలు తప్పనిసరి

పుష్కరాల నిర్వహణపై ఫిర్యాదులు, సూచనల కోసం జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్​లో 24 గంటలు పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఘాట్ల వద్ద భక్తుల రాకపోకలు సజావుగా సాగేలా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఎస్పీ తెలిపారు. నిబంధనలు కచ్చితంగా పాటించాలని వైద్యాధికారులు భక్తులకు విజ్ఞప్తి చేశారు. కొవిడ్ లక్షణాలు ఉన్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ పుష్కరాలకు అనుమతించబోమని, రాపిడ్ పరీక్షల్లో ఉందని తేలితే సమీపంలోని క్వారంటైన్​ కేంద్రాలకు తరలిస్తామని తెలిపారు.

ఇదీ చూడండి: కార్పొరేటర్‌గా ఓడినా.. ఎమ్మెల్యేలయ్యారు!

Last Updated : Nov 20, 2020, 6:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.