ETV Bharat / state

తప్పిపోయిన ఓ అమ్మ కథ.. గద్వాల్​ టు బంగ్లాదేశ్​ బోర్డర్..​ వయా అసోం.. - mother found on the borders of Bangladesh

తల్లి తప్పిపోయి నాలుగేళ్లు అయ్యింది. ఎన్నిచోట్ల వెతికినా జాడ కరవైంది. ఆశలు వదులుకున్న సమయంలో ఆమె ఆచూకీ దొరికిందనే కబురు.. కుటుంబసభ్యుల్లో ఆనందాన్ని నింపింది. అసోం వద్ద బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో ఉన్న తల్లిని.. కుమారుడు సంతోషంగా ఇంటికి తీసుకొచ్చాడు.

Jogulamba Gadwal
Jogulamba Gadwal
author img

By

Published : Sep 26, 2022, 10:23 AM IST

గద్వాల్​ టూ బంగ్లాదేశ్ వయా అస్సోం​.. తప్పిపోయిన అమ్మ కథ

జోగులాంబ గద్వాల జిల్లాలోని మల్దకల్ మండలం కుర్తిరావులచెర్వు గ్రామానికి చెందిన నాగేశ్వరమ్మకు మతిస్థిమితం లేదు. ఆమెకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలున్నారు. భర్త జమ్మన్నతో కలిసి ఆమె కుమారుల వద్ద ఉండేది. మతిస్థిమితం లేకపోవడం వల్ల తరచూ ఇంటి నుంచి వెళ్లిపోయి మళ్లీ తిరిగొచ్చేది. ఆనంతరం ఇంటినుంచి వెళ్లిన నాగేశ్వరమ్మ తిరిగిరాలేదు. 2019 ఫిబ్రవరిలో ఆమె భర్త మృతి చెందాడు. ఆ తర్వాత తల్లి జాడ కోసం కుమారులు వెతికినా ఫలితం లేకుండాపోయింది.

రెండ్రోజుల క్రితం అసోంలోని ఓ ఆశ్రమంలో భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులో నాగేశమ్మ ఉన్నట్లు సమాచారం వచ్చింది. ఏపీకి చెందిన ఓ జవాన్‌ ఆమెను గుర్తించి హైదరాబాద్‌లో తెలిసిన వారికి సమాచారమిచ్చారు. వారు పోలీసులకు చెప్పటంతో నాగేశమ్మ కుమారులను పిలిపించి తల్లి గురించి తెలిపారు. పోలీసులు చూపించిన ఫొటోలో తల్లిని గుర్తించిన పెద్ద కుమారుడు వెంకటన్న ఆమె దగ్గరికి వెళ్లారు.

అసోంలోని కాచర్ జిల్లా ఉత్తర్ బారిక్నగర్‌లోని వృద్ధాశ్రమంలో ఉన్న నాగేశమ్మను కలిసి భావోద్వేగానికి లోనయ్యాడు. తల్లిని స్వగ్రామానికి తీసుకొచ్చారు. నాలుగేళ్ల క్రితం ఇంటి నుంచి తప్పిపోయిందన్న కుమారులు ఏళ్లపాటు ఆచూకీ కోసం వెతికినా దొరక్కపోవటంతో ఆశలు వదులుకున్నామని చెప్పారు. ఇప్పుడు తిరిగిరావటంపై కుమారులతో పాటు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తల్లి నాగేశ్వరమ్మను కంటికి రెప్పలా కాపాడుకుంటామని కుటుంబసభ్యులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.