ETV Bharat / state

అలంపూర్ ఆలయంలో నిరంతర శుద్ధి - భౌతిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి

దాదాపు రెండున్నర నెలల విరామం అనంతరం 8వ తేదీ నుంచి జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఆలయాన్ని నిరంతరం సోడియం హైపోక్లోరైట్‌తో శుద్ధి చేస్తున్నారు.

The cleaning staff of the Alampur temple
అలంపూర్ ఆలయంలో నిరంతర శుద్ధి
author img

By

Published : Jun 6, 2020, 8:02 PM IST

సుదీర్ఘ విరామం తర్వాత భగవంతుని సన్నిధికి భక్తులు చేరువకానున్నారు. రెండున్నర నెలల విరామం అనంతరం 8వ తేదీ నుంచి జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. లాక్‌డౌన్‌ ఆంక్షల్లో భాగంగా ఆలయాల్లోకి భక్తులను అనుమతించకూడదనే నిబంధన విధించారు.దర్శన సమయాల్లో భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలను భక్తులు విధిగా పాటించాలని అధికారులు సూచించారు.

ఈసందర్భంగా ఆలయాన్ని సిబ్బంది నిరంతరం సోడియం హైపోక్లోరైట్‌తో శుద్ధి చేస్తున్నారు. పుష్కరిణుల్లో భక్తులు దిగకుండా చూడాలని, వీలుంటే వాటిని మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర మార్గదర్శకాలను అమలు చేయడంలో ఎక్కడా రాజీ పడవద్దని అధికారులు సూచించారు.

ఇదీ చూడండి: జీహెచ్ఎంసీ పరిధిలో పదో తరగతి పరీక్షలు వాయిదా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.