కరోనా రోగులతో వచ్చే అంబులెన్స్‌లకు పోలీసులు అనుమతించడం లేదు. జోగులాంబ గద్వాల్ జిల్లా పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు చేసి నిలిపివేస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. కొవిడ్ రోగులతో వస్తున్న అంబులెన్స్‌లను వెనక్కి పంపుతున్నారు. కొవిడ్ రోగుల బంధువులు ఈ తనిఖీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో వాహనాలను ఆపేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ లేకపోవడంతో కరోనా బాధితులను నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర వాహనాలను అనుమతిస్తున్నారు. కడప జిల్లా మైదుకూరు నుంచి హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌కు వెళ్తున్న అంబులెన్స్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఆసుపత్రిలో బెడ్ ఉందని చెప్పినా వినలేదు. 2 గంటలు ప్రాధేయపడ్డ అనుమతించలేదు. బాధితుడి పరిస్థితి తీవ్రంగా ఉండడం వల్ల కర్నూలుకు తిరిగి వెళ్లిపోయారు.
ఇదీ చదవండి: ఏపీ నుంచి వచ్చే కొవిడ్ రోగులను అనుమతించని పోలీసులు