జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అబ్రహం, జడ్పీ ఛైర్మన్ సరిత తిరుపతయ్య పాల్గొన్నారు. గతంలో విత్తనాల కోసం గంటల తరబడి క్యూ లైన్లో నిలబడాల్సి వచ్చేదని అబ్రహం అన్నారు. తెరాస ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నదాతలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా విత్తనాలు పంపిణీ చేస్తోందని తెలిపారు.
ఇవీ చూడండి: 254గ్రాముల కొకైన్, నైజీరియన్ గ్యాంగ్ అరెస్ట్