Students protest against liquor shop: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో మద్యం దుకాణాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. లిక్కర్ షాపులను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే అబ్రహం క్యాంపు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
మందుబాబులతో నిత్యం రద్దీ
అలంపూర్ చౌరస్తా... తెలంగాణ-ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు ప్రాంతం. ఇక్కడ ఇప్పటికే రెండు మద్యం దుకాణాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మందు బాబుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ చౌరస్తాలో ఒక డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల, స్కూలు, ఒక గురుకుల పాఠశాల ఉంది. దీనికితోడు ప్రభుత్వం కొత్తగా మరో రెండు దుకాణాలకు అనుమతించింది. నిర్వాహకులు నాలుగు దుకాణాలను అలంపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీన్ని ఖండిస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఇదీ చదవండి: Resident Doctors Strike: నీట్ పీజీ కౌన్సిలింగ్ వాయిదాపై వైద్యుల ఆందోళన
విద్యార్థులకు తప్పని తిప్పలు
మందు బాబుల వల్ల నిత్యం ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోయారు. వెంటనే మద్యం దుకాణాలు తొలగించాలని ధర్నా చేశారు. ఎమ్మెల్యే అబ్రహం క్యాంపు కార్యాలయానికి ర్యాలీగా తరలివచ్చి... బైఠాయించారు. డిసెంబర్ 2 లోగా మద్యం దుకాణాలు తొలగించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే అబ్రహం విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలు, కళాశాలలో ఆవరణలో ఉన్న మద్యం దుకాణాలు తొలగించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: CONGRESS 'VARI DEEKSHA': ధాన్యం కొనుగోళ్లపై కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో 'వరిదీక్ష'
రెండు మద్యం దుకాణాలు ఉంటేనే చౌరస్తాలో గందరగోళంగా ఉంటుంది. ఇటీవల ప్రభుత్వం అదనంగా మరో రెండు మద్యం దుకాణాలకు అనుమతిచ్చింది. అలంపూర్ చౌరస్తా ప్రధాన కూడళ్లలో నాలుగు మద్యం దుకాణాలు ఏర్పడితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో మా తల్లిదండ్రులు కళాశాల పంపించేందుకు సుముఖత చూపడం లేదు. చదువు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. మాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి కూడలికి వచ్చే ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ దుకాణాల వల్ల నిత్యం రద్దీగా ఉండి.. ఇబ్బందులు పడుతున్నారు. మద్యం దుకాణాలు ఏర్పాటు చేయకుండా చూడాలని కోరుతున్నాం.
-విద్యార్థినులు, అలంపూర్
ఇవీ చదవండి: