గద్వాల జిల్లా పరిపాలనా యంత్రాంగాన్ని పారదర్శకత, నిబద్ధతతో పనిచేసే విధంగా చూస్తానని, జిల్లాలోని మౌలిక సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని జిల్లా నూతన పరిపాలన అధికారి శ్రుతి ఓజా అన్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా పాలనాధికారిగా సోమవారం శృతి ఓజా బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు అధికారులు పూల బొకేలతో స్వాగతం పలికారు.
జోగులాంబ గద్వాల జిల్లాకు రావడం తనకు సంతోషంగా ఉందని అన్నారు. అంతకుముందు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ వరంగల్ కమిషనర్గా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్గా విధులు నిర్వహించానని తెలిపారు.