జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలంలోని మార్లబీడు, దోర్నాల గ్రామాల్లో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. దోర్నాలలో నిల్వ ఉంచిన 60 నకిలీ విత్తన ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అవి 400 గ్రాములున్నట్లు వారు తెలిపారు.
ధరూర్ మండల పరిధిలోని మర్లబిడ్లో రాకేశ్.. రంగు కలిపిన నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో తనిఖీలు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: జర జాగ్రత్త: మనుషులకే కాదు.. కరెన్సీకి కరోనా వైరస్!